శ్రీ కాళహస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
10 Feb, 2023 14:02 IST
తాడేపల్లి: శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసిన అనంతరం వేదపండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్, ఈవో అందజేశారు. ఈనెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.