వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం వైయస్ జగన్‌కు ఆహ్వానం
16 Aug, 2022 17:36 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను కలిసి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పూతలపట్టు ఎమ్మెల్యే యం.యస్.బాబు, కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఏ. మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వీ. సురేష్ బాబు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు, దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.
ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన ఆలయ వేద పండితులు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.