కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం వైయస్ జగన్‌కు ఆహ్వానం
26 Nov, 2022 11:26 IST
తాడేపల్లి: డిసెంబర్ 6 నుంచి 12 వరకు జరుగుతున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పీఠాధిపతి హాజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వానించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పీఠాధిపతి, కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి సీఎం వైయస్ జగన్‌ను కలిసి ఉర్సు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.