సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఐఎన్‌టీయూసీ నేతలు
24 Mar, 2021 18:48 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కార్మిక సంఘాల నేతలు బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా కాపాడాలని ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ ప్రెసిడెంట్ జి. సంజీవరెడ్డి, పలువురు ఐఎన్‌టీయూసీ నేతలు సీఎం వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని నేతలు సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రికి ఐఎన్‌టీయూసీ నేతలు వినతిపత్రం అందజేశారు.