తొట్టివారిపల్లె రామాలయ నిర్మాణ పనుల పరిశీలన
16 Feb, 2026 13:05 IST
అన్నమయ్య జిల్లా: రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం తొట్టివారిపల్లెలో నిర్మాణదశలో ఉన్న రామాలయాన్ని సోమవారం వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఆలయ నిర్మాణ పురోగతిపై గ్రామస్తులతో చర్చించి, పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పల్లె ప్రజలు స్వచ్చందంగా, ఏకమై ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తొట్టివారిపల్లె ప్రజలు శ్రీకాంత్ రెడ్డిని దుస్సాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
తొట్టివారిపల్లె ప్రజలతో శ్రీకాంత్ రెడ్డి ఆత్మీయంగా మమేకమై పేరుపేరునా పలకరించారు. పల్లె అభివృద్ధి, ఆలయ నిర్మాణం తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.