తిరుపతిలో ఇంధన కొరతపై వినూత్న నిరసన
28 Apr, 2026 12:08 IST
తిరుపతి: రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతి నగరంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు వైయస్ఆర్‌సీపీ యువనేత భూమన అభినయ్. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూపిస్తూ ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంధనం లభించక వాహనదారులు పడుతున్న అవస్థలు, పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడుతున్న క్యూలైన్లు వంటి పరిస్థితులను ఈ నిరసన ద్వారా ప్రజలకు తెలియజేశారు. రోజువారీ జీవనంపై ఇంధన కొరత తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సామాన్యుల జీవితం మరింత ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు.