చంద్రబాబును మహిళా లోకం క్షమించదు
7 Sep, 2023 11:13 IST
అనంతపురం: చంద్రబాబు వైయస్ విజయమ్మను కించపరిచారని, ఆయన్ను మహిళా లోకం క్షమించదని వైయస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు . చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా?. ముక్కు నేలకు రాసి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు. అలాగే.. అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు ను నిలదీస్తానని, అందుకోసం ఆయన శిబిరం వద్దకు వెళ్తానని ఎంపీ గోరంట్ల తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.