మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం భేటీ

23 Jan, 2020 11:10 IST

సచివాలయం: సీనియర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ చేసిన డ్రామాలు, తదుపరి కార్యాచరణపై సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యనేతలతో చర్చిస్తున్నట్లుగా సమాచారం.