ఇఫ్తార్ విందుకు వైయస్ జగన్ హాజరు
15 May, 2019 18:44 IST
వైయస్ఆర్ జిల్లా: పులివెందులలోని వీజే ఫంక్షన్ హాలులో మైనార్టీ సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందులో వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. రంజాన్ మాసం కుటుంబాలను, పొరుగువారిని, సమాజాన్ని మరింత చేరువ చేస్తుందని చెప్పారు. రంజాన్‌లో శాంతి, సహనంతో ఉండాలని ప్రజలు కోరుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.