విశాఖలో ప్రారంభమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ..
2 Nov, 2023 10:42 IST
విశాఖపట్నం: అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ విశాఖలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ హోటల్‌లో జరుగుతున్న ఈ సదస్సును కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే అజెండాగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో గురువారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది. 57 ఏళ్ల తరువాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు విశాఖ వేదికవడం విశేషం.