ఆ జ్ఞాప‌కాల‌ను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్‌

21 Feb, 2026 12:30 IST

తాడేప‌ల్లి:  మేక‌పాటి గౌతమ్‌రెడ్డి భౌతికంగా దూరమైనా, అతని జ్ఞాపకాలు, అతని ప్రేమ ఎల్లప్పుడూ తమతోనే ఉంటాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భావోద్వేగంతో  నివాళులు అర్పించారు. ఇవాళ గౌతమ్‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గౌతమ్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

“మన స్నేహం, మన అనుబంధం నింపిన మధుర జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్‌. స్నేహితుడిగా, సహోదరుడిగా నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతావు.” అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.