గడప గడపన అపూర్వ ఆదరణ
23 May, 2022 11:38 IST
అమరావతి : మూడేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. ఇకపై కూడా ఇదే ఒరవడి కొనసాగుతుందని హామీ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగిస్తున్నారు. అన్ని చోట్లా ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల గురించి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇంటింటా ప్రజలకు వివరిస్తున్నారు.
ఎక్కడైనా సమస్యలున్నాయని చెబితే వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 12వ రోజు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్ని జిల్లాల్లో ప్రజలు నేతలకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు.