సుప్రీం కోర్టు తీర్పు పేద ప్రజల విజయం

18 May, 2023 16:47 IST

విజయవాడ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పేదల పక్షాన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిలబడి గెలిపించారన్నారు. అమరావతిలో పేదలు ఉండకూదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని పెత్తందార్లంతా కలిసి హైకోర్టుకు వెళ్లారని, పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించి.. పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూముల్లో పేదలు నివసించడానికి అర్హులు అని తీర్పు చెప్పిందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పేదల పక్షాన ఎంత పోరాటం చేస్తుందో సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనమన్నారు.