హైకోర్టు సీజే అరూప్ గోస్వామిని సన్మానించిన సీఎం వైయస్ జగన్
6 Jan, 2021 10:44 IST
విజయవాడ: విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏపీ హైకోర్టు సీజే అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీజే అరూప్ గోస్వామి తో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ హైకోర్టు సీజే గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అరూప్ గోస్వామిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సన్మానించారు.