కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన వైయస్ఆర్‌సీపీ నేతలు
విజయవాడ: విజయవాడ నగరంలోని మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని వైయస్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ పరిశీలించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుండి కానూరువరకు రహదారి నీటమునిగింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలదిగ్భంధంలో చిక్కుకుంది. దుర్గగుడి కొండపై ఘాట్ రోడ్ లోకూడా కొండచరియలు పడ్డాయి. అలాగే విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో పలు కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రాంతాలను వైయస్ఆర్‌సీపీ నేతలు పరిశీలించారు.