ద్రౌపది ముర్ము జీకి హృదయపూర్వక అభినందనలు
22 Jun, 2022 12:29 IST
విశాఖ: ఎన్‌డీఏ తరఫున రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపతి ముర్ము గారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అభినందలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ఎన్‌డీఏ ద్వారా రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా నామినేట్ అయినందుకు శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి హృదయపూర్వక అభినందనలు. గౌరవనీయులైన పీఎం శ్రీ నరేంద్ర మోదీ.. మీరు మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారని సరిగ్గానే చెప్పారు. మేడమ్ మీకు మా శుభాకాంక్షలు అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.