సాత్విక్–చిరాగ్ జోడీకి వైయ‌స్‌ జగన్ అభినందనలు 

31 May, 2026 22:16 IST

 తాడేప‌ల్లి: కేఎఫ్‌ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్–2026 పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్లు Satwiksairaj Rankireddy, Chirag Shettyలకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత్‌కే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కూడా గర్వకారణమని పేర్కొన్నారు.

"కేఎఫ్‌ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్–2026 పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి హృదయపూర్వక అభినందనలు. ఇది భారత్‌కు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ ల‌వేదికలపై దేశ ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నాను" అని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.