అక్కచెల్లెమ్మలకు వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
18 Aug, 2024 23:23 IST
తాడేపల్లి: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కచెల్లెమ్మలంతా తమ జీవితాల్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్నారు. అన్నిరంగాల్లో మహిళలు రాణించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.