చిరకాల మిత్రుడు సజ్జలకు జన్మదిన శుభాకాంక్షలు
16 Jun, 2024 18:29 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా ..అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.