గుంతకల్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ భవాని కంటతడి
29 Aug, 2025 13:18 IST
అనంతపురం: మున్సిపల్ అధికారుల తీరుపై గుంతకల్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ భవాని కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల విషయంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కౌన్సిల్ హాల్ లో చైర్‌పర్సన్ భవాని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఆదేశించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు చేయడం లేదంటూ అధికారులపై మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.