విశాఖ విజన్ డాక్యుమెంటు రూపొందించిన ఘనత వైయస్.జగన్ దే 

13 Dec, 2025 08:26 IST

విశాఖపట్నం: విశాఖ విజన్ డాక్యుమెంటు రూపొందించిన ఘనత వైయస్.జగన్ దేనని.. అందులో భాగంగానే 
వైజాగే రాష్ట్రానికి ఎకనమిక్ గ్రోత్ ఇంజన్ అన్న విషయాన్ని ఆనాడే చెప్పారని వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికే... నేడు చంద్రబాబు నోట వినిపిస్తుందన్న ఆయన... మా విజన్ డాక్యమెంటులో భాగమే విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటైందన్నారు. తద్వారా ఇతర పరిశ్రమల రాకకూ మార్గం సుగమం అయిందన్న అమర్... ఎవరది విజన్? ఎవరు విజనరీ? ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉపాధి, పరిశ్రమల పేరుతో కూటమి భూదోపిడీ పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం... ఊరూ పేరు లేని సంస్థకు కారుచౌకగా భూములు అప్పగిస్తోందని మండిపడ్డారు. ఏం ఉద్యోగాలిస్తాయని రియల్ సంస్థలకు కారుచౌకగా భూకేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు 13.50 ఎకరాలు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.250 కోట్లు రాయితీలు కల్పిస్తూ... లులూ మాల్ కు చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  లోకేష్ ప్రమోషన్ కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తూ, ఆత్మస్తుతి పరనింద తప్ప... చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే...

● విశాఖ విజన్ వైయస్.జగన్ దే...

విశాఖ నగరానికి ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న వనరులు, వైయస్.జగన్ హయాంలో విశాఖ నగరానికి ఇచ్చిన విజన్ డాక్యుమెంట్లు, ఈ ప్రాంత  భవిష్యత్తు గురించి మేం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికే.. ఇవాళ సీఎం చంద్రబాబు నోటి నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగోదఫా ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు గతంలో 2014-19 మధ్యలో విశాఖపట్నం వనరులు, ఇక్కడున్న అవకాశాలను మీలాంటి విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? అమరావతి అని చెబుతూ నాటి నుంచి నేటి వరకూ అదే పాట ఎందుకు పాడుతున్నారు? ఇవాళ విశాఖలో కాగ్నిజెంట్ వంటి సంస్థలతో పాటు మరికొన్ని కంపెనీలకు శంకుస్థాపన చేశారు. పరిశ్రమలు, కొత్త కంపెనీలు రావడం ఒక నిరంతర ప్రక్రియ. కోవిడ్ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్ధితులను బేరీజు వేసుకుని,  దేశంలో కొన్ని నగరాలకే ఐటీ కంపెనీలు అనుబంధమై ఉన్న తరుణంలో, టయర్ టూ సిటీల వైపు పెద్ద సంస్థలను అడుగులు వేస్తున్న తరుణంలో వాటిని మా హాయాంలో అవకాశంగా తీసుకున్నాం. పెద్ద కంపెనీలను విశాఖ వస్తే.. మిగిలినవి కూడా ఇక్కడకి రావడానికి ఆసక్తి చూపుతాయన్న ఆలోచనతోనే ఆ రోజు ఇన్ఫోసిస్ కంపెనీని విశాఖపట్నం తీసుకొచ్చాం.

● చంద్రబాబు అడ్డగోలు భూకేటాయింపులు...

ఆ రోజు ఏ సంస్ధకూ రూపాయికే భూములిచ్చిన పరిస్థితులు లేవు. ప్రభుత్వం మీద నమ్మకం, ఆ ప్రాంతంలో ఉన్న వనరులు సౌలభ్యం మేరకు ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడుతుంది. ఇన్ఫోసిస్ ను విశాఖలో నెలకొల్పాలని చెప్పినప్పుడు.. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు చెంది, దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నవాళ్లు ఎంతమంది విశాఖపట్నం రీలొకేట్ కావడానికి సిద్ధంగా ఉన్నారని ఇన్ఫోసిస్ సర్వే చేస్తే... దాదాపు 3000-3500 మంది ఆసక్తి చూపారు. అప్పుడే దాదాపు 1000 మందితో డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభిస్తే... ఇవాళ  అది కాస్తా రెండువేలకు చేరింది. తర్వాత టీసీఎస్ తో మాట్లాడం. 
ఇవాళ మంత్రిగారు మాట్లాడుతూ.. కాగ్నిజెంట్ చేసిన సర్వేలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 3వేల మంది విశాఖ రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కానీ  టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి మేజర్ కంపెనీలు పేరిట వీటిని మందుపెట్టి.. ఆయా సంస్దల పేరుతో పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతుందని ప్రజలు గమనించారు. పెద్ద సంస్థలకు భూములివ్వడంలో తప్పులేదు. వారిని తీసుకువచ్చి భూములివ్వడంలో తప్పులేదు. వారిని మేము కూడా ఆహ్వానిస్తాం. 

కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు మీరు ఎందుకు రూ.1, 50 పైసలకే భూములు కేటాయిస్తున్నారు. ఇందులో ఉన్న మీ స్వలాభం ఏమిటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట ఈ రకమైన భూపందేరాలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు అని రకరకాల పేర్లతో రూ.20, రూ.25 కోట్ల ఖరీదు చేసే భూములను కేవలం రూ.50 లక్షలు, రూ.1 కోటికి కేటాయిస్తుంటే.. దీని వెనుక ఉన్న మీ లాలూచీ ఏమిటి? ఇవే గ్రూపులకు పక్కనున్న తెలంగాణా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంటే.. మనం కూడా ఇస్తున్నామని చెప్పడంలో ఓ అర్ధం ఉంటుంది. ప్రజలు కూడా అంగీకరిస్తారు. కానీ ఇవే సంస్థలు పక్కరాష్ట్ర ప్రభుత్వాలు భూములుకు వేలం నిర్వహిస్తే.. రూ.100, రూ.150 కోట్లకు భూములు కొంటుంటే.. ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ధరకు ఇస్తున్నారు? అవేవీ ఐటీ సంస్థలు కావే? అవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు. వాటికి రూ.1, 50 పైసలకే ఎలా భూములు కట్టబెడతారు? విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములే తక్కువ, ఇక్కడున్న ప్రతి సెంటు భూమీ విలువైనది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం 400-500 ఎకరాల భూములి కట్టబెట్టింది. ఏదీ కూడా మార్కెట్ లో ఎకరా రూ.10 నుంచి రూ.20 కోట్లు తక్కువ లేని భూములను  రూ.1, 50 పైసలకే కట్టబెడుతున్నారు. ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం .. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు? 

● రియల్ ఎస్టేట్ సంస్థలకూ దోపిడీ...

ఈ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చూస్తే... సత్వా, కపిల్ సంస్ధలకిచ్చిన భూముల్లో 50 శాతం రెసిడెన్షియల్ కింద వాడుకోవాలని జీవో ఇచ్చారు. అంటే విల్లాలు, ఆపార్టమెంట్లు కట్టుకోవాలని జీవో ఇచ్చారు. విల్లాలు, అపార్ట్ మెంట్లు కట్టుకుంటే ఉద్యోగాల కల్పన జరుగుతుందా? భూములను తక్కువకే కట్టబెట్టడంతో పాటు వారి నిర్మాణఖర్చులో ఎస్ ఎప్ టి కి  రూ.2వేల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇన్సెంటివ్ గా ఇస్తామని చెబుతున్నారు. భూములు చౌకగా ఇవ్వడంతోపాటు వారు భవనాలు కట్టడానికి డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా కంపెనీలకు ఇచ్చిన జీవోల్లో మీరు మీకిచ్చిన లక్ష్యాలు సాధిస్తేనే రిజిస్టర్ చేస్తామని ఎక్కడా నిబంధన లేదు.

సాధారణంగా ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వాలు భూమిలిచ్చిన తర్వాత... వారు ఏడాదో, రెండేళ్ల తర్వాతే మీ నిర్మాణాలు ఎందుకు పూర్తిచేయలేదు అని అడిగితే కోర్టులనాశ్రయిస్తున్నారు. అలా ఈ రాష్ట్రంలో  ఏపీఐఐసీకి సంబంధించి 17వేల ఎకరాలు లీగల్ ఇష్యూష్ లో ఉన్నాయి. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఇవాళ భూములిచ్చిన సంస్థలు మార్కెట్ లేదన్న సాకుతో నిర్మాణాలు చేయకపోతే.. రెండేళ్ల తర్వాత మీరు నోటీసులిస్తే కోర్టుకు వెళతారు. అప్పుడు ఆ భూములన్నీ నిరుపయోగంగా పడి ఉంటాయి. ఎవరికీ ఉపయోగం లేదు.ఇవాళ లులూ మాల్ నే తీసుకుంటే  13.50 ఎకరాలు, 99 సంవత్సరాల లీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.250 కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చినా.. 14 ఏళ్లుగా లులూ మాల్ విశాఖలో కడతామని చెబుతున్నారు. ఇదే లులూ మాల్ గుజరాత్ లో తమ మాల్స్ నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేస్తుంది. ఏపీకి, గుజరాజ్ తి ఏంటి తేడా అని చూస్తే... అక్కడ చంద్రబాబు లేడు, ఇక్కడ చంద్రబాబు ఉన్నాడన్నదే తేడా. ఇదే లులూ సంస్థ హైదరాబాద్ లో అద్దెకు భవనాలు లీజుకు తీసుకుంటుంది. సొంత రాష్ట్రం కేరళలో కూడా భూములు కొంటుంది. ఇక్కడ మాత్రం చంద్రబాబు సంతర్పణ చేస్తారు. 
ఉచితంగా ఇవ్వడానికి చంద్రబాబు ఉన్నాడు కాబట్టి తీసుకుంటున్నారు. ఇదంతా కొడుకు పబ్లిసిటీ, ప్రమోషన్ కోసమే. ప్రభుత్వ పెయిడ్ ప్రచారాన్ని,  తన కొడుకు ప్రమోషన్ కోసం వాడుకుంటున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. 

● ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలెక్కడ...

ఇవాల ఏడెనిమిది సంస్థలకు శంకుస్థాపనల చేస్తున్నామని పత్రికల్లో యాడ్స్ ఇస్తూ.. 40వేల ఉద్యోగాలిస్తామని ప్రకటనలు ఇచ్చారు. పూర్తి వివరాలు చూస్తే.. ఒక సంస్థ 8 సంవత్సరాల తర్వాత 25వేల ఉద్యోగాలిస్తుందని, మరో సంస్థ 500 ఉద్యోగాలిస్తుందని ఉంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగఅవకాశాలిస్తామని చెప్పారు.  అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తై దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంతవరకు ఎంతమంది యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు? 
ఎంతమందిని ఉద్యోగాల్లోంచి తొలగించారో, ఎంతమందిని రోడ్డున పడేశారో నేను చెబుతాను. రెండేళ్లలో మీరిచ్చిన ఉద్యోగాలేవీ కనిపించడం లేదు, మరో మూడేళ్లలో  20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? 

ఉద్యోగాలు లేని యువతకు రూ.3వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు, అదీ లేదు. ఏడాదికి 3 ఉచిత సిలెండర్లు అన్నారు, అది కూడా లేదు. ప్రచారం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇవాళ కూడా హైదరాబాద్, చార్మినార్ అదే సొంత డబ్బా మొదలుపెట్టారు. ఆత్మస్తుతి పరనింద తప్ప మరొకటి లేదు. 
ఇప్పిటికైనా మార్కెటింగ్ ఆపి, చేయాల్సిన పనుల మీద దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి విశాఖపట్నమే ఎకనమిక్ గ్రోత్ ఇంజన్ అని వైయస్.జగన్ విశాఖ శక్తి సామర్ధ్యాలు గురించి చెప్పిన మాట ప్రకారం మీరు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఎవరు విజనరీయో అన్న విషయాన్ని ప్రజలు గమనించాలని అమర్నాద్ విజ్ఞప్తి చేశారు.

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ....

డేటా సెంటర్ విషయంలో ఇప్పటికే మా పార్టీ విధానం స్పష్టం చేశాం. తాజాగా ప్రభుత్వం కూడా కేబినెట్ లో మొత్తం గూగుల్ సంస్థ తమ హక్కులన్నీ ఆదానీకి ఇస్తున్నాం. భూమి కేటాయింపులు, రాయితీలు, మినహాయింపులు అన్నీ అనుబంధ సంస్థ అయిన ఆదానీకీ ఇమ్మని చెప్పారు. దీని ప్రకారం ఎవరి తీసుకొచ్చారో మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజు మేము ఆదానీకీ డేటా సెంటర్ గురించి భూములు కేటాయిస్తే... మొత్తం ఆదానీకీ దోచిపెడుతున్నారని గగ్గోలు పెట్టిన మీరందరూ ఇవాళ అదే ఆదానీతో కూర్చుని మాట్లాడుతున్నారు. వైయస్.జగన్ తో ఆదానీ మాట్లాడితే ఆదానీ తప్పు, ఇవాళ మీతో కూర్చుని మాట్లాడితే ఆదానీ మంచివాడు, ఇదేనా చంద్రబాబు ఉద్దేశం?

డిప్యూటీ సీఎం ఇటీవల కాలంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళడం చూశాం. పత్రికల్లో ఇవాల యాడ్స్ చూస్తే.. గతానికి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండేవాళ్లు. ఇవాళ  సీఎం చంద్రబాబు, సకలశాఖా మంత్రి లోకేష్ తప్ప మరెవ్వరూ కనబడ్డం లేదు.
అభివృద్ధి వికేంద్రీకరణ మా పరిపాలన, విజన్. దాన్ని కూటమి నేతలు అనుసరించే పరిస్థితి మేం తీసుకొచ్చాం. స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా మార్పు చేశామో చూశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ దాదాపు 1.50 కోట్లకు పైగా సంతకాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనం.
 
2014-19 మధ్యలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలని చంద్రబాబు చెప్పారు. మరలా అదే చెబుతారు. ఆ రోజు చెప్పిన 20 లక్షల కోట్లకు వచ్చింది రూ.35వేల కోట్లు పెట్టుబడులు మాత్రమే. అంటే ఇంచుమించు 2 శాతం వచ్చింది, అంతకంటే ఆయన గురించి, ఆయన ప్రచార పిచ్చి గురించి ఇంకేం చెప్పలేమని స్పష్టం చేశారు.