రాజమహేంద్రవరంలో సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
రాజమహేంద్రవరం: సీఎం వైయస్ జగన్ వరద భాదిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఏఎస్‌ఆర్ జిల్లా కూనవరం, గొమ్ముగూడెం పర్యటన అనంతరం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇక్కడ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి స్ధానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి గెస్ట్‌హౌస్‌కు వచ్చే మార్గంలో తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. దీంతోపాటు ఇద్దరు అనారోగ్య బాధితుల సమస్య విని వారికి తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ మాధవీలత ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున సాయం అందజేశారు. రాత్రికి ఇక్కడే బస చేసిన సీఎం రేపు ఉదయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బయలుదేరి వెళతారు, అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం తాడేపల్లి తిరుగు పయనమవుతారు