కర్నూలు ఎయిర్ పోర్టులో సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
5 Jul, 2022 10:58 IST
కర్నూలు: జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఓర్వకల్లు విమానాశ్రయంలో పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్, డీఐజీ, మేయర్ తదితరులు స్వాగతం పలికారు. ఓర్వకల్లు నుంచి ఆదోనికి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.