సీఎం వైయస్ జగన్ ఘనస్వాగతం పలికిన కర్నూలు
18 Feb, 2020 11:51 IST
కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు చేరుకున్నారు. కంటి వెలుగు ఫేజ్–3 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కర్నూలు వచ్చిన సీఎంకు జిల్లా వాసులు ఘనస్వాగతం పలికారు. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించి తొలిసారి కర్నూలు వచ్చిన సీఎంకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఎస్ఏపీ క్యాంపు నుంచి ఎస్టీబీసీ కాలేజీ వరకు రోడ్డు పొడవునా మానవహారం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.