కందుకూరు దుర్ఘ‌ట‌న బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వ సాయం

30 Dec, 2022 15:59 IST

నెల్లూరు:  ఈ నెల 28 వ తేదీ  కందుకూరు లో జరిగిన దుర్ఘటనలో మృతి చెందినవారి  కుటుంబ సభ్యులకు కందుకూరు సబ్ కలెక్టర్  కార్యాలయంలో  శుక్రవారం ప్ర‌భుత్వ సాయాన్ని అంద‌జేశారు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు  గోవర్ధన్ రెడ్డి  జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీదర్ రెడ్డితో  కలిసి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున 8 మందికి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంక్ చెక్కులను అందజేశారు.