బాబు తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
1 Dec, 2020 09:31 IST
అసెంబ్లీ: శాసనసభలో నిన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన తీరు దురదృష్టకరం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సంస్కారాన్ని మరిచి సీఎంను వాడూ వీడు అని వ్యాఖ్యానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అకస్మాత్తుగా ప్రజల్లోకి వచ్చిన వారు ఇలానే పిచ్చిగా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు.