రాజ్యాంగ నిర్మాతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

26 Nov, 2021 13:27 IST

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.