వైయ‌స్ జగన్‌ మీ బిడ్డ.. రైతుల తరఫున నిలబడే బిడ్డ 

8 Jun, 2022 11:44 IST

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీ బిడ్డ, రైతుల తరఫున నిలబడే బిడ్డ అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం  ఇల్లూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. మన జగనన్నలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడని అన్నారు. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదని అన్నారు. 
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శింగనమల నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగిపోతోంది. ఎమ్మెల్యే వెంట అధికారులు కూడా ఉండటంతో సమస్యలేమైనా ఉంటే అక్కడికక్కడే వారితో మాట్లాడుతూ, ఒక బుక్ లో నోట్ చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్న వైనాన్ని తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా విద్యార్థుల చదువులను ఆరా తీస్తున్నారు.

ఇలా ఎమ్మెల్యే తనదైన శైలిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందుకు సాగిపోతున్నారు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసి, మళ్లీ ఐదేళ్ల వరకు కనిపించని నాయకులనే చూశాంగానీ, ఇలా ప్రజల ముందుకు వచ్చి ఇంకా ఏం కావాలి? అని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.