బెలుగుప్ప తాండలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం
ఉరవకొండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉరవకొండ నియోజకవర్గంలో విజయవంతంగా జరుగుతోంది. శుక్రవారం బెలుగుప్ప మండలం బెలుగుప్ప తాండ గ్రామంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డికి ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం లభించింది. ముందుగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఇంటింటికి వెళ్లిన ఆయనను ప్రజలు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అవి సకాలంలో అందుతున్నాయా? లేదా? అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలువుతున్నారు.