టీటీడీ పవిత్రతను దెబ్బ తీసిన ఛైర్మన్‌ 

2 Mar, 2026 16:18 IST

తిరుపతి: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అనైతిక ప్రవర్తన, బయటకు వచ్చిన ఆయన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపర్చాయని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి అప్రాచ్య కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అంత అడ్డంగా ఆధారాలతో సహా దొరికినా, బీఆర్‌ నాయుడు తన వీడియోలు మార్ఫింగ్‌ అని అబద్ధాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. కానీ, ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ నిర్ధారిత సంస్థలు ఆ వీడియోలన్నీ ఒరిజినల్‌ అని స్పష్టం చేశాయని వెల్లడించారు.    
    తప్పు చేసి దొరికిపోయి, ఇప్పుడు మా అధినేత శ్రీ వైయస్‌ జగన్‌పైనా, వైవీ సుబ్బారెడ్డి పైనా ఏకవచనంతో, నీచంగా మాట్లాడటం బీఆర్‌ నాయుడు అహంకారానికి నిదర్శనమని భూమన ఆగ్రహించారు. ‘నా కాలిగోటికి కూడా సరితూగని నువ్వు నా గురించి మాట్లాడతావా?‘ అంటూ, తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి.. బీఆర్‌ నాయుడికి చురకలంటించారు.
ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఏ మాత్రం నైతికత ఉన్నా పదవి వీడాలి:
    టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్త్రీలోలుడని 2019లోనే ఆధారాలు బయటపడ్డాయి. అలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగించడం అంటే సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామిని అవమానించడమే. బీఆర్‌ నాయుడుకు ఏ మాత్రమైన సిగ్గు. కనీస నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో చంద్రబాబునాయుడే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలి. లేదా చంద్రబాబు ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలి.

బీఆర్‌ నాయుడి దురహంకారం:
    బీఆర్‌ నాయుడు మరో మహిళతో చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయట పడడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి పాలకమండలి అధ్యక్షుడిగా ఉండి, ఇలాంటి అనైతిక, అప్రాఛ్య కార్యకలాపాలకు పాల్పడ్డంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంత పక్కాగా ఆధారాలతో సహా దొరికినా కూడా, బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, సరైన వివరణ ఇవ్వకుండా, తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేశారని దబాయించారు. ఆ తర్వాత మాట మార్చి, తమ రెండు కుటుంబాల మధ్య 30 ఏళ్ల అనుబంధం ఉందని కల్లబొల్లు కబుర్లు చెప్పారు.
    ఇంకా బీఆర్‌ నాయుడు దుర్యోధనుడి కంటే అహంకారంగా మాట్లాడుతూ నన్ను, మా నాయకుణ్ని ఏకవచనంతో సంబోధించారు. ‘బీఆర్‌ నాయుడు వంటి ఛప్రాసీ గురించి ఆలోచించడం ఇష్టం లేకే మేం ఆ భాష మాట్లాడ్డం లేదు. నా కాలి గోటికి కూడా నువ్వు సరి తూగవు. అలాంటి నువ్వా నన్ను విమర్శించేది’!.
    1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేను ఇచ్చిన కరపత్రం తీసుకోకపోతే, ఆయన జుబ్బా పట్టుకుని లాగి మరి ఆయన చేతిలో కరపత్రం పెట్టిన ధైర్యం నాది. అలాంటి నా గురించి నువ్వా మాట్లాడేది?.

ఇందులేఖ లేఖలతో నాయుడు బండారం బట్టబయలు:
    బీఆర్‌ నాయుడు ఏ మహిళతో ముప్పై ఏళ్ల అనుబంధం అన్నాడో సదరు మహిళ.. 2019 ఎన్నికల టైంలో అప్పటి టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడుకి, నారా లోకేష్‌కు, పవన్‌కళ్యాణ్‌కు లేఖ రాశారు. తాడేపల్లి ఇందులేఖ తన ఉత్తరాల్లో బీఆర్‌ నాయుడుతో సంబంధాల గురించి స్పష్టంగా రాశారు.
    ‘తాము 36 ఏళ్ల క్రితం తెనాలి నుంచి హైదారాబాద్‌ మణికొండలో నివాసం ఉంటున్నామని, తనకు బీఆర్‌ నాయుడికి 25 సంవత్సరాలుగా ఉన్న పరిచయం కాస్తా రిలేషన్‌గా మారిందని.. అయితే తమ ప్రయాణంలో బీఆర్‌ నాయుడు వల్ల తనకు సుఖం, సంతోషం లేకపోగా అనేక అవమానాలు, ఆర్దిక ఇబ్బందులు పడ్డానని, కేవలం తన అవసరాల కోసమే నాతో రిలేషన్‌లో ఉంటున్నారన్న విషయం అర్ధం కావడానికి నాకు ఏళ్లు పట్టింది. నాకు 16 ఏళ్ల కూతురు కూడా ఉందని, బీఆర్‌ నాయుడుతో తన సంబంధం మొదలైన తర్వాత, తన కూతురికి ఆటో ఇమ్యునో డిసీజ్‌ (ఎస్‌ఎల్‌ఇ) వచ్చిందని, ఇప్పుడు తన కూతురు జీవన్మరణ పోరాటం చేస్తోందని ఆవేదన చెందారు. వాస్తవాలన్నీ ఇలా ఉంటే, బీఆర్‌ నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, బూతులు తిడుతూ నీకు తాళి కట్టానా అని పదే పదే ప్రశ్నిస్తూ నీచంగా చూస్తున్నా.. ఇన్నాళ్లూ బాధలు భరిస్తూ ఉన్నానని చెప్పారు. కాగా, తాను టీడీపీ అభిమానిని కావడంతో, మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుడిని రోడ్డున పడేయడం ఇష్టం లేక ఫిర్యాదు కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇంకా బీఆర్‌ నాయుడు భయంకరమైన స్త్రీలోలుడు. వావివరసలు లేని వ్యక్తి అని ఇందులేఖ తన లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ నాయుడు వంటి వ్యక్తికి అత్యున్నత పదవి ఇస్తే.. చిన్న పని కోసం మహిళలు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారు. అది పార్టీకి చెడ్డపేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో నేను రాసిన ప్రతి అక్షరానికి కట్టుబడి ఉన్నానని అంటూ’.. ఇందులేఖ తన లేఖలో స్పష్టంగా రాశారు.

బీఆర్‌ నాయుడూ.. ఇదీ నీ యవ్వారం:
    ఇప్పుడు చెప్పు బీ ర్‌ నాయుడు నీ యవ్వారం ఏంటి? నీ బతుకు ఇది. పశువు కంటే హీనమైన వ్యక్తివి. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేస్తున్న నీచుడివి నువ్వు. చంద్రబాబునాయుడుకి లేఖ రాసినా పట్టించుకోలేదంటే.. ఆయన కూడా ఇలాంటి  ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నీచుడికి టీటీడీ చైర్మన్‌ పదవి ఇచ్చారనిపిస్తుంది. 
    ప్రెస్‌మీట్‌ పెట్టి తగ్గేది లేదంటున్నాడు. నీ లాంటి వాళ్లను మనిషిగా కూడా నేను చూడ్డం లేదు. నేను నీ దగ్గరకి వచ్చానని చెప్పుకుంటున్నావు. నిన్ను చూస్తే భయపడుతున్నానని చెపుతున్నావు. నీలాంటి దద్దమ్మలు ఈ పదవికి అర్హులు కాదు. నువ్వు వాడిన బాష వల్లే ఇలా తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. అందుకు నేను సభ్యసమాజానికి క్షమాపణ చెబుతున్నాను. 
హైదరాబాద్‌ నడిబొడ్డున వ్యాపారాలు చేస్తున్నానని చెబుతున్నావు. నీ అక్రమ వ్యాపారులు, నువ్వు సంపాదించిన వేలాది కోట్ల అక్రమ సంపదన అందరికీ తెలుసు.

భగవద్గీతను అవమానిస్తావా?:
    టీటీడీలో 2002లో లక్ష్మయ్య అనే సీనియర్‌ అసిస్టెంట్‌కు వివాహేతర సంబంధం ఉంటే, అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. టీటీడీకి అంత పవిత్రత ఉంటుంది. కానీ, నీవు ఇప్పుడు దాని పవిత్రతకు దిగజార్చుతున్నావు. కాగా, భగవద్గీత లో రూ.50 కోట్లు మింగేశారంటూ, బోర్డు సమావేశంలో విసిరాడని తెలిసింది. ఆ పుస్తకాల్లో నేను మందుమాట రాశానని ఆ పుస్తకాలను విరిసికొట్టాడు. అసలు భగవద్గీత విలువ నీకు తెలుసా నాయుడు?. కృష్ణ భగవానుడి భగవద్గీతను ఐదు భాషల్లో ప్రచురిస్తే ఛీ భగవద్గీత అంటావా?.. అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.