శ్రీవారి లడ్డూ నెయ్యి టెండర్లలో వెలుగు చూస్తున్న వాస్తవాలు

12 Feb, 2026 15:46 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి ధరలు, టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ 'హెరిటేజ్' ప్రమేయంపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. తిరుపతి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన హెరిటేజ్ సంస్ధకు సంబంధించిన పలు ఆధారాలను బయటపెట్టారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే.. నారా భువనేశ్వరి గారి ఫోటోతో పాటు 'ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్' అనే సంస్థ వారి మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా స్పష్టంగా ఉందని భూమన వెల్లడించారు. ఇదే హిందాపూర్ సంస్థ 2014లో రూ.16.50 లక్షల కేజీల నెయ్యిని రూ.306కే టీటీడీకి సరఫరా చేసిన విషయాన్ని బయటపెట్టారు. మరోవైపు చంద్రబాబు హయాంలోనే (2013-19 మధ్య) ప్రీమియర్ డెయిరీ ఆగ్రోఫుడ్స్ అనే సంస్థ కేజీ నెయ్యిని రూ. 320, రూ. 273, రూ. 332లకే దాదాపు 40 లక్షల కేజీల మేర సరఫరా చేసిందని సిట్ ఛార్జిషీట్ లో నివేదించిన విషయాన్ని గుర్తు చేసిన భూమన..  గత ప్రభుత్వ హయాంలో రూ.300 లోపే స్వచ్ఛమైన నెయ్యి ఎవరిస్తారంటూ పదే పదే చంద్రబాబు ప్రశ్నించడాన్ని తప్పు పట్టారు. తన హయాంలో తక్కువ ధరకు కొన్నప్పుడు లేని అభ్యంతరం, ఇతరుల హయాంలో ఎందుకు వచ్చిందని  నిలదీశారు. మరోవైపు గతంలో కేజీ నెయ్యి రూ.278కే సరఫరా చేసిన  ఇందాపూర్ సంస్థ, మరలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేజీ నెయ్యి ధరను ఏకంగా రూ. 658 కి పెంచి టెండర్లు దాఖలు చేయడం వెనుక మతలబు ఏంటని భూమన ప్రశ్నించారు. 2014లో ఎల్-1 (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్), ఎల్-2 (ఇందాపూర్) కలిపి కాంట్రాక్ట్ తీసుకున్నాయని, ఇప్పుడు 2025లో కూడా అవే సంస్థలు పోటీకి రావడం వెనుక భారీ లాలూచీ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అత్యధిక లాభాల కోసమే నెయ్యి ధరను కృత్రిమంగా పెంచారని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే...

● ఇందాపూర్ డెయిరీ- హెరిటేజ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్టే.. 

చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ ను తనిఖీ చేస్తూ..  వాళ్ల మాన్యుఫాక్చరింగ్  యూనిట్స్ చూస్తే.. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ భువనేశ్వరి గారి ఫోటోతో పాటు  ఉంది. అమెజాన్ వెబ్ సైట్ లో కూడా ఉంది.  2014లో రూ. 16.50 లక్షల నెయ్యిని రూ.306 కే ఇందాపూర్ డెయిర్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డెయిరీ యూనిట్ తో కలిసి  టీటీడీకి సరఫరా చేసింది. అప్పటి స్పెసిపైడ్ అథారిటీ చైర్మన్ గా ఉన్న జే ఎస్ వీ ప్రసాద్ గారి సంతకంతో 15-01-2015లో అనుమతి ఇచ్చారు. మొత్తం రూ.50.49 కోట్ల నెయ్యిని ఈ రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా టీటీడీపి నెయ్యిని సరఫరా చేశాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ యూనిట్ అని టీటీడీ వెబ్ సైట్ లో ఉంది. అదే విధంగా ఇందాపూర్ సంస్థ 2015లో రూ.278 లకే మరలా టెండర్లలో పాల్గొని రూ.278కే కేజీ నెయ్యి సరఫరా చేసింది. అంటే చంద్రబాబు కుటుంబ ఆధీనంలో నారా భువనేశ్వరి గారు చైర్మన్ గా ఉన్న హెరిటేజ్ సంస్థ యొక్క మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్టే ఇందాపుర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఈ విషయం వాళ్లే స్పష్టం చేశారు.
అంతే కాకుండా 2016లో ఇందాపుర్ సంస్థ డిస్ క్వాలిఫై అయింది. 

● అధిక ధరల వెనుక మతలబేంటో చెప్పాలి.

ఇందాపూర్ పేరుతో నెయ్యి సరఫరా చేస్తూ.. హెరిటేజ్ సంస్ద పేరును బయటకు రాకుండా చేశారని.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న వాస్తవాలు బయట పెట్టాలని కోరారు. ఒకేసారి కేజీ నెయ్యి రూ.658 కు ఎందుకు పెరిగింది ? ఇదే సంస్థ రూ.278 కు సరఫరా చేసింది. వైయస్సార్సీపీ హయాంలో అంత తక్కువ ధర రూ.300కే ఎలా ఇస్తారని ప్రశ్నించిన చంద్రబాబు.. తన హెరిటేజ్ కు చెందిన ఇందాపూర్ యూనిట్ కూడా అదే ధరకు సరఫరా చేసింది అంటే అది కల్తీ నెయ్యి అనుమానం కూడా ఇప్పుడు కలుగుతోంది. ఒకవేళ ఇవాళ రూ.658కు పెంచి టెండర్లు దాఖలు చేసిందంటే..ఏ స్ధాయిలో అత్యధిక లాభాలకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రశ్న తలెత్తుతుంది.  2014లో రూ.306 కే 16.50 లక్షల కేజీలు నెయ్యి కొన్నప్పుడు ఎల్ -1 గా కర్ణాటక మిల్క్ ఫెఢరేషన్ సరఫరా చేసింది. అప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తోపాటు ఎల్ -2 గా ఉన్న ఇందాపూర్ మిల్క్ ఫెడరేషన్ కు కలిపి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు మరలా ఆ రెండు సంస్థలే 2025లో పోటీకి వచ్చాయంటే.. ఈ సంస్థలు కలిపి టెండర్లు దాఖలు చేయడం, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉన్న ఇందాపూర్ కూడా కలిసి ఉండడం వెనుక లాలూచీ ఉందన్న అనుమానాలను భూమన వ్యక్తం చేశారు. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన ఇందాపూర్ డెయిరీ ద్వారా జరుగుతున్న ఈ లావాదేవీల వెనుక ఉన్న వాస్తవాలను సీఎం వెంటనే బయటపెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.