తిరుమల లడ్డూ వ్యవహారంలో బయటపడ్డ కుట్ర

30 Jan, 2026 14:43 IST

రాజమండ్రి: తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ని రాజకీయాల్లోకి లాగడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు, పంది, చేప కొవ్వు వాడారంటూ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సీబీఐ నెల్లూరు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్  ద్వారా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువులు కొవ్వులు వాడలేదని స్పష్టమైందని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్ లు శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

● ఆధారాల్లేకుండా చంద్రబాబు పచ్చి అబద్దాలు.. 

సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఏ ఆధారంతో మాట్లాడారో జవాబు ఇవ్వాలి. అప్పటికే ఇంకా ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు కాకుండానే నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దానికి కొనసాగింపుగా డిప్యూసీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ డీ డీ బీ నుంచి వచ్చిన నివేదికల్లో జంతు కొవ్వు కలపలేదని నివేదిక వస్తే.. దానిపై ఎందుకు మాట్లాడ్డం లేదు? ఇప్పటివరకు దానిపై సీఎం చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరూ స్పందించడం లేదు. మన దేశంలో ఉన్న 100 కోట్లకు పైగా ఉన్న హిందువులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. జంతుకొవ్వు కలిసిందని ఏ ఆధారంతో మాట్లాడారు? సీబీఐ నివేదికలో జంతు కొవ్వు లేదని స్పష్టం చేయడంతో చంద్రబాబు చెప్పింది అబద్దమని తేలింది.  చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పును అంగీకరించాలి. తిరుమల లడ్డూ విషయంలో అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు, ఆ తర్వాత టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మాటలు వెంటే మనకు వాస్తవాలు అర్ధం అవుతాయి. ఈవో నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని చెబితే.. చంద్రబాబు గారు ఏకంగా జంతు కొవ్వు కలిసిందని ప్రకటించారు. ఆ తర్వాత మరలా ఈవో నెయ్యి నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించామని చెబుతుండగా... చంద్రబాబు ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడామని విరుద్దమైన ప్రకటనలు చేశారు.  మరోవైపు మంత్రి లోకేష్ మాట్లాడుతూ... నాణ్యత పరీక్ష కోసం నెయ్యిని ల్యాబ్ కి పంపిస్తే అందులో పంది, పశు మాంసం కొవ్వులు ఉన్నాయని చాలా స్పష్టంగా వచ్చిందని చెప్పారు. కానీ వాస్తవానికి ఎన్ డీ డీ బీ, సీబీఐ సిట్ ఇచ్చి నివేదికలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇస్తే.. ఈ రకంగా దుర్మార్గమైన మాటలు ఎలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, సనాతిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఏం చేయాలి? ఇలా మాట్లాడే హక్కు వీళ్లకు ఎవరు ఇచ్చారు? మరో మనిషి ఎవరైనా పవిత్రమైన తిరుమలపై ఇలా నిరాధారంగా మాట్లాడితే అలాంటి వాళ్లను ప్రజలు కొట్టి చంపుతారు.  ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుంటే వీహెచ్ బీ, భజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్ ఏస్ హిందూ సమాజం ఎందుకు ఉపేక్షిస్తున్నారు.

2014-19 వరకు చంద్రబాబు హయాంలో నెయ్యి సరఫరా ధరలు చూస్తే... కేజీ నెయ్యి రూ.320, రూ.344, రూ.354 కే టెండర్లు వేశారు. 2018 జనవరిలో  ఎల్ -1 కోట్ చేసిన ధన కేజీ నెయ్యి రూ.320 కాగా...  వాళ్లకు 23.30 లక్షల కేజీల నెయ్యి సరఫరాకు అనుమతినిచ్చారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో 2019-20లో రూ.410 కేజీ చొప్పున టెండర్లు దాఖలు చేస్తే.. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.389 కే టీటీడీ కొనుగోలు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో టెండరు దారులే ఇప్పటివరకు ఉన్నారు. ఈ వ్యవహారంలో టెండరు దారులగా ఉన్న జైన్స్ ను కూడా నిందితులగా చేర్చి.. నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనే ఉందని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. 
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూలో జంతు కొవ్వు, చేప నూనే కలిసిందని.. అలా తయారైన లక్ష లడ్డూలు అయోధ్యరామమందిరానికి పంపించారని అడ్డగోలుగా మాట్లాడారు. ఒకవైపు ఎన్ డీ డీ బీ రిపోర్టు, సిబీఐ కోర్టుకిచ్చిని నివేదకలో ఎలాంటి జంతు కొవ్వు లేదని చెబుతుంటే... ఇలా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న ఈ వ్యక్తులను ఏం చేయాలి? హైకోర్టు ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని వీరి ముగ్గురు పై కేసు నమోదు చేయాలి.

● ఆలయాల్లో కూటమి నిర్లక్ష్యం...

కేవలం తిరుమల తిరుపతి మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవస్ధానాలన్నింటిలోనూ ఈ రకమైన దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నవరంలో స్వామి వారి ప్రసాదం విక్రయ కేంద్రంలో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్నా... ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. ఎన్టీయే ప్రభుత్వ హాయంలోనే ఇన్ని అపచారాలు జరుగుతున్నా.. హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పుకునే భారతీయ జనతాపార్టీ ఏం చేస్తోంది? హిందూ సమాజం కూడా ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై స్పందించాలి. పచ్చి అబద్దాలు చెప్పిన కూటమి నేతలను ఇంకా ఏ రకంగా వెనుకేసుకుని వస్తున్నారు? పైగా రాష్ట్ర వ్యాప్తంగా అవే అబద్దాలతో కూటమి నేతలు సిగ్గు లేకుండా ఆలయాల్లో పాలాభిషేకాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ ముగ్గురినీ శిక్షించడం ఖాయమి... ఇందులో భాగస్వామ్యులైన అధికారులకూ అదే శిక్ష తప్పదని మార్గాని భరత్ హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్  వీళ్లు మాట్లాడింది తప్పు అని పశ్చాత్తాప పడితే.. ముగ్గురూ తిరుమల లో ఆ శ్రీ వేంకటేశ్వరస్వామికి క్షమాపణ చెప్పి.. తమ ముక్కు నేలకు రాసి దేవదేవుడితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

అదే విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో రోజుకొక వీడియో బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కమిటీలతో కాలయాపన చేయడాన్ని తప్పుపట్టారు. 

● డాక్టర్ గూడూరి  శ్రీనివాసరావు, వైయ‌స్ఆర్‌సీపీ నేత 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని సైతం రాజకీయాల్లోకి లాగిన దుర్మార్గుడు చంద్రబాబునాయుడు. దిగజారిన రాజకీయాలకే ఇదే ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ.. హిందూ సమాజాన్ని అవహేళన చేయడంతో పాటు  హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం. కేవలం తమ పాలనా పరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా దేవుడు ప్రసాదంపైనే నిందలు వేయడం దారుణం. వీరిని కచ్చితంగా దేవుడు శిక్షించడం ఖాయమని డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు హెచ్చరించారు.