ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెట్రోలు డీజిల్ కృత్రిమ కొరత
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్-డీజిల్ కృత్రిమ కొరతకి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే ఎందుకు కొరత కనబడుతుందని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న పెట్రోల్ బంక్‌లను మంగళవారం సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక లలో ఎక్కడా కూడా ఈ కొరత లేదని పేర్కొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన వారం రోజుల నుంచి కూడా 5000 రూపాయలు డీజిల్ కొట్టించుకోవాలంటే 2000 కొట్టించుకోండి, లేకపోతే 3000 కొట్టించుకోండి, అదే పెట్రోల్ కోసం బైకులు తీసువెళ్తే 50 రూపాయలు, 100 రూపాయలు కొడతా, లీటర్ కొడతా అంటున్నారని ఆయన ప్రస్తావించారు. అసలు ఈ కొరత ఎందుకు వచ్చిందని అడుగుతున్నామన్నారు.
పక్కన తెలంగాణలో హైదరాబాద్‌లో ఎక్కడా కూడా ఇలాంటి నిబంధనలు లేవని మాజీ ఎంపీ భరత్ అన్నారు హైదరాబాద్‌లో పెట్రోలు డీజిల్ వాడకం ఎంత? ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లో గాని లేకపోతే టౌన్స్‌లో గాని జరిగే వాడకం చూస్తే, కొరత ఏమిటని ఆయన ప్రశ్నించారు. బంకుల దగ్గర ఆటు చూడండి, ఇటు చూడండి అక్కడ కారు వాళ్లని కూడా పోలీసులే దగ్గర ఉండి పంపించేస్తున్నారని ఆయన అన్నారు. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయని భరత్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ వాళ్లు ట్యాంకర్లు తీసుకొని వచ్చి తెలంగాణ నుంచి పెట్రోలు , డీజిల్ పట్టుకెళ్తున్నారని తెలంగాణ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిమాట్లాడారని మాజీ ఎంపీ భరత్ పేర్కొంటూ అసలు ఇదంతా చూస్తుటేనే, ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తా ఉన్నారో తేటతెల్లం అవుతోందన్నారు.
కనీసం ఏ మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేదని, సిగ్గుశరం లేకుండా ఉందని మాజీ ఎంపీ భరత్ వాపోయారు. 20 లీటర్లు, 10 లీటర్లు ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్లు డీజిల్ పోయట్లేదని జనాలు చెబుతున్నారని రెండు రోజుల క్రితం నుంచి చూస్తే కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూ లైన్లు ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయని ఆయన అన్నారు. ఒక పక్క రైతులు వరి కోతలు, మరోపక్క ఆక్వా రైతులు కూడా డీజిల్ పైన ఆధారపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మరి వీళ్లందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకోస్తారని ఆయన ప్రశ్నించారు. 20 లీటర్లు, 30 లీటర్లు ట్యాంకులు తీసుకొని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వెళితే, ఎలాగన్నారు. ఎంతటి హీనాతిమైన పొజిషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ప్రజల్ని ఒకసారి అవగాహన చేసుకోవాలని మాజీ ఎంపీ భరత్ కోరారు. ఇదేదో నిరసన కార్యక్రమంగా ఉత్తినే చేయట్లేదని, ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టంచేసారు. పైగా భారతదేశ వ్యాప్తంగా డీజిల్ గాని పెట్రోల్ గాని అత్యధిక రేట్ల విషయంలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉందని ఆయన అన్నారు. ఫస్ట్ ప్లేస్ హైయెస్ట్ రేట్లు అమలు చేసే దారుణాతి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చాయంటే అంటే అసలు ఏ స్థాయిలో ఉందనేది కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు రివ్యూలు చేసి, తగిన చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేసారు. అసలు రైతాంగానికి ఇప్పుడు వరి కోతల సమయం కనుక తక్షణమే ఎక్కడా కూడా కొరత లేకోకుండా ప్రజలకి అందుబాటులో పెట్రోల్, డీజిల్ ఉంచే ఏర్పాట్లు చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.