శాంతిభద్రతల పరిరక్షణ ఏదీ?
29 Mar, 2025 14:58 IST
తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి లో వరుసగా దారుణమైన ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి... ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. శనివారం రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో భరత్ మీడియాతో మాట్లాడారు.
మార్గాని భరత్ రామ్ ఏమన్నారంటే..
- గడచిన నాలుగైదు రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుంది
- ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమాస్పందంగా మృతి చెందారు.
- పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్విట్ చేయటం దారుణం
- పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారు?. ఇది బాధ్యతారహిత్యం కాదా..
- క్రైస్తవ సంఘాలు ఇది హత్య అని ఘోషిస్తున్నాయి
- ఫార్మసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించింది
- బొల్లినేని కిమ్స్ ఎంజిఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్ గా ఉంది
- ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది
- ఇష్యుని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది
- అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారు.
- అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తాం
- తన అవయవాలు దానం చేయాలని, తాను మళ్ళీ పుట్టాలనుకోవడం లేదని సూసైడ్ నోట్ లో బాధితురాలు రాసింది
- నిందితులు దీపక్ దీన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశాడు
- ఆసుపత్రిలో సిసి ఫొటోస్ పూర్తిగా బయట పెట్టండి
- బాధితురాలికి, కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం
- ఈనెల 23న రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు... ఎఫ్ఐఆర్ డేట్ ను ఎందుకు మార్చారు... ఇది అనేక అనుమానాలు తావిస్తుంది.
- హాస్పిటల్ మేనేజ్మెంట్‌ను ఎందుకు ఎఫ్ ఐ ఆర్ లో చేర్చలేదు
- సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్ అబ్‌స్కాండ్ అయ్యాడు
- దీపక్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, అతని మామ రాజమండ్రిలో క్రియాశీలక నాయకుడు
- అధికార పార్టీకి చెందిన వారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుంది
- ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదు ... బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి..
- ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక అబద్ధాలు చెబుతున్నారు
- రాజమండ్రిలో విచ్చలవిడిగా వైన్ షాపులు పర్మిట్ రూములు పెట్టి నడిపిస్తున్నారు
- ఎమ్మెల్యే కి చెందిన వైన్ షాపులు కూడా ఉన్నాయి
- వైన్ షాపులు పక్కనే పర్మిట్ రూములు పెట్టుకోవటానికి ఎవరు వీరికి అధికారం ఇచ్చారు.
- రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధుల వైఫల్యమే దీనికి కారణం...
- గోదావరి నదికి గర్భశోకం కలిగిస్తున్నారు
- గోదావరి నదిని ఇష్టారీతిన తవ్వి ఇసుక తోడేస్తున్నారు
- దీనిపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు
- రాజమండ్రిలో భూమాఫియా కబ్జాలు చేస్తోంది
- రాజమండ్రిలో కబ్జాలు పెరిగిపోతున్నాయి ...హోండా షోరూం సమీపంలో ఉన్న 1300 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఫెన్సింగ్ వేశారు
- కొయ్యల రమణ అనే మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి...
- వీటిని నిలిపివేయకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని మార్గాని భరత్ హెచ్చరించారు.
బాధితురాలు తండ్రి ఏమన్నారంటే..
- నా బిడ్డ అంజలిని వికాస్ ఫార్మసీ కాలేజీలో చదివించాము...
- ఏం జరిగిందో తెలియదు ఈనెల 23న పాప పడిపోయిందని ఫోన్ చేశారు...
- రెండు రోజుల తర్వాత గాని పూర్తి విషయాలు తెలియలేదు
- మా పాపకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు