ఉరవకొండ సీఎం సభ విజయవంతం
ఉరవకొండ: ఉరవకొండలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంగ్రాండ్ సక్సెస్ అయ్యిందని వైయస్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరవకొండలో మంగళవారం జరిగిన వైయస్ఆర్ ఆసరా సభ గతంలో ఎన్నడూ లేని విధంగా సభ విజయవంతమైందన్నారు.ఇందుకు అధికారులు, వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రనిధులు, నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ అభిమానులు సమష్టి కృషితోనే సాధ్యమైందని తెలిపారు. ఉరవకొండకు ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రావడం రాష్ట్రంలో మహిళలందరికీ వైయస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ఉరవకొండ వేదిక కావడంతో తమకెంతో సంతోషంగా ఉందన్నారు. తమ అంచనాలకు మించి జనం వచ్చారని పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రజలకు ఉన్న అభిమానానికి, అచంచల విశ్వాసానికి సభకు వచ్చిన జనమే సాక్ష్యం అన్నారు. వైయస్ఆర్ ఆసరా సీఎం సభను విజయవంతం చేసిన అక్కాచెల్లెమ్మలు, వైయస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ, వారం రోజుల పాటు అధికారిక విధులు నిర్వహించిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ ప్రకటనలో మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.