కేసులకు, అరెస్టులకు భయపడే మనస్తత్వం నాది కాదు
10 Jul, 2025 16:39 IST
నెల్లూరు: కేసులకు, అరెస్టులకు భయపడే మనస్తత్వం తనది కాదని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది తన ఇంటిపై దాడి చేయించిందని మండిపడ్డారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లాకు పరిచయం చేశారని పేర్కొన్నారు. నిన్న చెన్నై హాస్పిటల్ కి వెళ్తే.. తాను పారిపోయినట్లు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ప్రసన్న కాళ్ళు, చేతులు కట్టేసి తన కాళ్ల కింద పడేయ్యమని ప్రశాంతి రెడ్ది చెప్పారట.. ఇంట్లోనే ఉన్నా.. ఎవరోస్తారో రండి..అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.