మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు
నెల్లూరు: జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహానికి వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. మధుసూదన్ మృతదేహం కావలి చేరుకుంది. విషయం తెలుసున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. దేశం మొత్తం మృతుడి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా.. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. మృతుని కుటుంబ సభ్యులను మాజీ సీఎం వైయస్ జగన్ సంతాపం తెలిపారు’ అని ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.