అది ఒక గెలుపేనా?
నంద్యాల: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో గెలిచిన గెలుపు ఒక గెలుపేనా అని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రశ్నించారు. పోలీస్ ఖాకీలను అడ్డుపెట్టుకొని అక్కడ కూటమి ప్రభుత్వం గెలిచిందని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల తీరుపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..`వందలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన వైనం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మంత్రి సమక్షంలో అనుచరులు ఒంటి మిట్ట ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఏజెంటు పై దాడి చేయడం అమానుషం. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఖాకీ కాళ్లను పట్టుకున్న కూడా కనికరం చూపని పోలీస్ వ్యవస్థ . పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడినా ఖాకీలు చోద్యం చూశారు. ఎన్నికల కమిషన్‌కు ఇవేవి పట్టడం లేదు` అంటూ కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.