తిరుమల లడ్డూపై చంద్రబాబు పాపం పండింది
వైయస్ఆర్ కడప జిల్లా: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు, సీబీఐ సిట్ నివేదిక సాక్షిగా పచ్చి అబద్ధాలని తేలినా ఇంకా దుష్ప్రచారం చేయడంపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారిని బజారుకు ఈడ్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కడపలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గాలివార్తల ఆధారంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై విషప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. కేవలం వైయస్.జగన్ పై వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారంటూ పచ్చి అబద్దాలు ప్రచరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దేశ చరిత్రలోనే అత్యంత దారుణమని విమర్శించారు. సీబీఐ,ఎన్డీడీబీ వంటి అత్యున్నత సంస్థలు జంతుకొవ్వు లేదని చెబుతున్నా, చంద్రబాబు ఇంకా కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పుడు నెయ్యిలో యాసిడ్స్ కలిపారంటూ మళ్లీ విషప్రచారం మొదలుపెట్టారని, ఇది కేవలం గతంలో చేసిన అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికేనని తేల్చి చెప్పారు. స్వామివారి పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు దేవుడి శిక్ష తప్పదని, అబద్ధాలు ఆడిన వారి నోరు పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వామివారికి, కోట్లాది మంది భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...
● లడ్డూ పై గాలి వార్తాల ఆధారంగా ఘోరారోపణ..
లడ్డూ ప్రసాదంపై వివాదానికి 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు మొట్టమొదట బీజం వేశాడు. గాలివార్తను ఆధారంగా చేసుకుని రాజకీయంగా వైయస్.జగన్ ని నాశనం చేయడంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న దురాలోచనతో, దేశంలో ఉన్న హిందువుల మనస్సుల్లో వైయస్.జగన్ పట్ల వ్యతిరేక భావం కలిగించాలన్న దురుద్దేశంతో తప్పుడు ప్రచారానికి తెరలేపాడు. దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి పట్ల భక్తిశ్రద్దల్లేని చంద్రబాబు ఏకంగా స్వామి వారిని బజారుకీడ్చాడు. ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆధారంలేని మాటలు మాట్లాడకూడదన్న గౌరవం కూడా చంద్రబాబుకి లేదు. కోట్లాదిమంది స్వామి వారి భక్తుల మనోభిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా... కేవలం వైయస్ఆర్‌సీపీని నాశనం చేసేందుకు ఎన్ని కుట్రలైనా పన్నడానికి, ఎన్ని అబద్ధాలైనా ఆడ్డానికి, ఎన్ని మోసాలైనా చేయడానికి ఏ స్ధాయిలోనైనా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ తరహా కార్యక్రమాలు చేయడమే చంద్రబాబు సిద్ధాంతం. అందులో భాగంగానే స్వామి వారి లడ్డూ ప్రసాదాల్లో జంతు కొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిపి తయారు చేసి ప్రసాదంగా పెట్టారని, వైయస్.జగన్ ప్రభుత్వం, టీటీడీ బోర్డు, ఈవో ఈ ఘోరమైన పాపం చేశారని ప్రకటన చేశారు.
● చంద్రబాబుకు దేవుడు పట్ల కనీస భక్తి విశ్వాసాల్లేవు...
నిజంగా చంద్రబాబుకి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పట్ల భక్తి ఉన్నా, ముఖ్యమంత్రి స్ధానం పట్ల గౌరవం ఉన్నా, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పోలీసులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిస్తే... బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు అయితే దానిపై బహిరంగ ప్రకటన చేయరు. స్వామివారి పవిత్రతకు భంగం కలగకుండా, భక్తుల భాధపడకుండా విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ప్రభుత్వంలో బాధ్యతగల వ్యక్తులగా దానిపై సీబీఐతో విచారణ జరిపించి.. నిజాలు నిగ్గు తేల్చి.. నిర్ధారణ అయిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే న్యాయంగా ఉండేది. కానీ కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రకటించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు.
● సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయించిందే వైయస్ఆర్‌సీపీ.
దీనిపై అప్పటి టీటీడీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ నేత వై వీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని అభ్యర్ధించారు. మా అభ్యర్ధన మేరకు స్పందించిన సుప్రీం కోర్టు ... సీబీఐ విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూనే .. ఎలాంటి ల్యాబ్ రిపోర్టులు, ఆధారాలు లేకుండానే లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఎలా ప్రకటిస్తారు? భగవంతుడికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకుంటారా? అని చంద్రబాబు తరపు ఆస్దాన లాయర్ లూథ్రా ను, చంద్రబాబును మందలించింది.
అయినా చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు లేదు.
● తప్పుడు ఆరోపణలపై బాబు క్షమాపణ చెప్పాల్సిందే..
సీబీఐ నేతృ త్వంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి, ఆహార భద్రతకు సంబంధించిన ఒక అధికారితో కూడిన సిట్ బృందం మీ ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్ధాయిలో దర్యాప్తు చేసింది. 210 పేజీల ఛార్జిషీట్ ను కోర్టుకు సిట్ సమర్పిస్తూ... 44వ పేజీలో ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేశారు. అప్పుడైనా నా వల్ల పొరపాటు జరిగింది, స్వామి వారి పట్ల అపవిత్రమైన మాటలు మాట్లాడాను అని క్షమించమని దేవుడ్ని కోరుకుంటూ.. ప్రజలకు వాస్తవాలు చెప్పి ఉంటే నీకు కొద్దిగానైనా గౌరవం దక్కేది చంద్రబాబూ. కానీ ఆ పనిచేయకుండా.. నాలుగైదు రోజుల తర్వాత కూటమి భాగస్వామి పార్టీలను, భజన మీడియాతో మాట్లాడుతూ మరో కుట్రకు తెరలేపాడు. ఇప్పుడు జంతువుల కొవ్వు అన్న పదం వదిలేసి.. నెయ్యి కల్తీ అయిందని మాట్లాడుతున్నాడు. బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్స్, కెమికల్ వాడారంటూ... మరలా దుష్ప్రచారం మొదలుపెట్టాడు. తాను మొదట చెప్పినట్లు లడ్డూలో జంతుకొవ్వు కలిపారన్న ఆరోపణ.. సిట్ నివేదిక సాక్షిగా అబద్దమని తేలిన తర్వాత ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా చంద్రబాబూ?
● తిరస్కరించిన టీటీడీ - వెల్ కమ్ చెప్పిన టీడీపీ...
సీబీఐ దర్యాప్తు చేసినప్పుడు శాంపిల్ గా తీసుకున్న నెయ్యి ఎప్పటిది? 2024లో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వ హయాంలోనే జూన్ 12, 21,25, జూలై 4 తేదీల్లో సరఫరా అయిన నెయ్యి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. అదే నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, పామాయిల్ కానీ, ఇతర రకాల కల్తీ జరగడానికి ఆస్కారం ఉందని సీబీఐ నివేదికలో చెప్పింది.వాస్తవానికి ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న కారణంతో టీటీడీ ఈ 4 ట్యాంకుల నెయ్యిని పరీక్షించి వెనక్కి తిప్పి పంపించింది. అలా వెనక్కి వెళ్లిన 4 ట్యాంకులు శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ మిషన్ దగ్గర పెట్టుకుని 20 రోజుల తర్వాత జూలైలో అవే ట్యాంకులకు టీటీడీ అనుమతిచ్చింది. దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాతే అవే నెయ్యి ట్యాంకులు మరలా వచ్చాయి. అంటే కల్తీ నెయ్యిని టీటీడీ తిరస్కరిస్తే.. టీటీడీ వెల్ కమ్ చెప్పింది.
వైయస్.జగన్ హాయంలో రూ.320 కే కేజీ నెయ్యి సరఫరా చేశారు.. ఆ ధరకు వస్తుందా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.320కే ఏ కంపెనీ అయితే సరఫరా చేసిందో.. 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే కంపెనీతో ఒప్పందం చేసుకుని రూ.290కే కేజీ నెయ్యి కొన్నాడు. రూ.320కే వైయస్.జగన్ కొన్నది నెయ్యి కాకపోతే.. రూ.290 కే కొన్నదాన్ని నెయ్యి అనాలా? మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. బోలేబాబా సంస్థకు ఒక్క ఆవు లేదు, ఎలా నెయ్యి సరఫరా చేస్తారని అడుగుతున్నారు. అసలు బోలేబాబా సంస్థకు నెయ్యి సరఫరా చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని 2014లో సర్టిఫై చేసి ఇచ్చిందే మీ ప్రభుత్వం. 2019 మార్చి 6వ తేదీన అనుమతిచ్చి.. అదే రోజు 82వేల కేజీల నెయ్యి సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి టెండర్ల విధానాన్ని సరళీకృతం చేసిందంటున్నారు. 2014- 19 జనవరిలో తామే టెండర్ల విధానం కఠినతం చేశామని చెబుతున్నారు. అంటే టీడీపీ గత ప్రభుత్వ హయాంలో 2014-19లో కూడా టెండర్లు సరళతరంగా ఉన్నాయనే అర్దం. వైయస్.జగన్ ప్రభుత్వంలో నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు అధిక చర్యలు తీసుకున్నారు.
● సీబీఐ చెబితే అబద్దం, సీబీఎన్ చెబితే నిజమా..?
కానీ చంద్రబాబు మాత్రం బరితెగించి... లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు అని రాపించేవరకు నిద్రపోయే పరిస్ధితి లేకుండా పోయింది. గాలి వార్తల ఆధారంగా చంద్రబాబు ఇవే ఆరోపణలు చేస్తే... సుప్రీం మందలించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అలాంటి అత్యున్నత సంస్థ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో జంతుకొవ్వు లేదని చెప్పినా చంద్రబాబు అది వాస్తవం కాదంటున్నారు. ఎన్ డీ డీ బీ, ఎన్ డీ ఆర్ ఐ ల్యాబులు రిపోర్టు ఇచ్చినా దాన్నీ కాదంటున్నారు.
మరి ఎవరి చెబితే నిజం? సీబీఐ చెబితే అబద్దం, సీబీఎన్ చెబితే నిజమా? సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయరా?
● ఏకసభ్య కమిషన్ పేరుతో మరో నాటకం..
తాము అనుకున్న ఫలితం రాకపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పేరుతో మరో విచారణకు సిద్దమవుతున్నారు. సీబీఐ విచారించిన తర్వాత మరలా రాష్ట్రంలో విచారణ చేయించడమంటే.. పదో తరగతి పాసైన తర్వాత మరలా రెండో తరగతిలో కూర్చొన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం. చంద్రబాబును మా పార్టీ నేతలు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటున్నారు.. నేను మాత్రం ఆ మాట అడగను, కారణం చంద్రబాబుకి అసలు ఆత్మే లేదు. చంద్రబాబు తన హెరిటేజ్ లో అసలు పాలే లేకుండా పెరుగు అమ్మాడు. నాణ్యతా ప్రమాణాలు లేవని హెరిటేజ్ కి రూ.1 లక్ష జరిమానా వేస్తే.. దాన్ని చెల్లించారంటే తప్పు చేసినట్లే లెక్క.
చంద్రబాబు అసత్యాలకు పుల్ స్టాప్ పడాలంటే... దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామే తన పవిత్రను నిరూపించుకోవాలి. స్వామి వారికి అపచారం చేస్తూ పలికిన మాటలకు చంద్రబాబు నోరు పడిపోవాలి. లేదు నెయ్యిలో జంతుకొవ్వు కలిపితే మా చేతులు పడిపోవాలి. లేదంటే జంతుకొవ్వు అని మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల నోరు పడిపోతే అప్పుడు స్వామివారికి చేపట్టిన అపచారానికి తగిన శిక్ష అనుభవించినట్లవుతుంది. ఇది తప్పదని బలంగా నమ్ముతున్నాను.
చంద్రబాబు ఎన్టీఆర్ కి చేసిన ద్రోహం, ప్రజలకు చేసిన మోసం, స్వామి వారికి చేసిన అపచారానికి తగిన శిక్ష తప్పదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అంతిమ రోజుల్లో చంద్రబాబుకు ప్రజల ఛీత్కారం తప్పదని స్పష్టం చేశారు. చివరగా భక్తుల తరపున అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు జవాబివ్వాలన్న రాచమల్లు.. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించన నేపధ్యంలో సీబీఐ నివేదికలో జంతుకొవ్వు లేదని తేల్చిన తర్వాత స్వామివారికి, భక్తులకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు?
ఇప్పటికైనా చంద్రబాబు తన వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి, కోర్టులను, భక్తుల మనోభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. లేని పక్షంలో శ్రీ వేంకటేశ్వరస్వామి శిక్షించడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.