చంద్రబాబు రాయలసీమ ద్రోహి
17 Nov, 2024 18:42 IST
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం నగరంలో ఆదివారం అనంతవెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..
- రాష్ట్ర విభజన గుణపాఠాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్చుకోలేదు
- వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి పై చంద్రబాబు కు చిత్తశుద్ధి లేదు
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధానిగా ఏర్పాటు
- రాజధాని ఒక చోట ఉంటే హైకోర్టు మరో ప్రాంతం లో ఉండాలని శ్రీబాగ్ ఒప్పందం చెబుతోంది
- ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలయిక కోసం కర్నూలు రాజధాని త్యాగం
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు విఘాతం కలిగిస్తే ఎలా?
- వైయస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు కేంద్రం గా న్యాయ రాజధాని ఏర్పాటు చేశారు
- కర్నూలు లో ఉన్న లోకాయుక్త హ్యుమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను చంద్రబాబు తరలించడం దుర్మార్గం
- అనంతపురం జిల్లా కు మంజూరైన ఎయిమ్స్ ను అమరావతికి తరలించారు