మహిళలంటే పవన్‌కు గౌరవం లేదు
10 Jul, 2023 12:50 IST
విజయవాడ: మహిళలంటే పవన్‌కు గౌరవం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతోందని గుర్తు చేశారు. కరోనా సమయంలో పవన్ ఫాంహౌజ్‌లోనే పడుకున్నాడని, వాలంటీర్ల మాదిరి ప్రజలకు సేవ చేయలేదని విమర్శించాడు. వాలంటీర్లలో ఎక్కువశాతం మహిళలే ఉన్నారని చెప్పారు. పవన్‌కు సిగ్గు,శరం లేదని.. వాలంటీర్లకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.