గుడివాడలో టిడిపి, జనసేన గుండాల దాడి ఉన్మాద చర్య
విజయవాడ: కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక పై శనివారం గుడివాడ నియోజకవర్గంలో టిడిపి జనసేన గుండాలు దాడికి పాల్పడటం ఉన్మాద చర్య అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు .ఉప్పల హారిక కారుపై రాళ్లతో కర్రలతో దాడి చేసి కారును ధ్వంసం చేసి ఉప్పల హారిక వెళ్లేటువంటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్ళనీయకుండా కూటమి గుండాలు అడ్డుపడ్డాన్ని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటన లో ఖండించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హెయమన్నారు.రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలు అయినా బీసీ మహిళ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.పవన్ కళ్యాణ్ చంద్రబాబు,లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.