ఐడీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
ఎన్టీఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత నాయకులు, ప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అన్ని పనులను సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలంటే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వడం కీలకమని పేర్కొంటూ, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.