క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి..బాబు మోసాన్ని తెలుసుకోండి
1 Jul, 2025 17:24 IST
శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు ఏడాది పాలనలో ఎంత మోసపోయామో తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవాలని మాజీ మంత్రి, జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, ఎన్నికల హామీలు మరిచి, ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని, చంద్రబాబు మోసాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలు మేరకు మంగళవారం పరిగి లోని బీరప్ప స్వామి సన్నిధి నుంచి "రీకాలింగ్ చంద్రబాబు" మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరించారు. బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో ఇంటింటికి కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.