పెనుకొండ నియోజకవర్గంలో తవ్వుకున్నోళ్లకి… తవ్వుకున్నంత

28 Jan, 2026 14:54 IST

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో తవ్వుకున్నోళ్లకి… తవ్వుకున్నంత… అన్నట్లుగా పరిస్థితి తయారైంది అని మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  ఉషాశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలనువైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె స్వయంగా పరిశీలించారు.  మంత్రి సవిత అనుచరులు ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

ప్రతి గ్రామంలో మంత్రి సవిత మాఫియా ముఠా
గ్రావెల్‌, మట్టితో సంపద సృష్టించుకోమని మీరే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు..? అని ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌ ప్రశ్నించారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పూర్తిగా బరితెగించి, ఎలాంటి అడ్డు అదుపు లేకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో మంత్రి సవిత మాఫియా ముఠా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ విషయమై స్థానిక ప్రజలు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఆధారాలతో సహా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ స్పందించని అధికారులు రేపటి రోజున తప్పక అవస్థల పాలవుతారని హెచ్చరించారు. పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సవితతో పాటు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉషాశ్రీచరణ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మండల  నాయకులు, కార్యకర్తలు, గోరంట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.