వైయస్ఆర్‌సీపీ కార్యకర్తకు మాజీ మంత్రి రోజా పరామర్శ

చిత్తూరు జిల్లా: నగరి రూరల్ మండలం దేశరాగరం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రంగనాథం ఇటీవల అక్రమ కేసులో అరెస్టు అయి చిత్తూరు సబ్ జైల్లో నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయన్ను మాజీ మంత్రి ఆర్కే రోజా గురువారం పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటానని, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొందామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే అక్రమ కేసులతో భయాందోళనకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ పాలనను పక్కనపెట్టకపోతే పోరాటం తప్పదన్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా అక్రమ కేసులకు భయపడరు, చట్టపరంగా కేసులు ఎదుర్కుంటామన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది, మనమంతా కలిసి పోరాడుదామని ధైర్యం చెప్పారు.