చంద్రబాబు సేవ కోసమే జనసేన పార్టీ
అసెంబ్లీ: చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని, సీఎం వైయస్ జగన్‌ను తిట్టేందుకే ఆవిర్భావ సభ పెడుతున్నారని, సీఎంను తిట్టడమే తప్ప వారికి వేరే అజెండా లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్ని నాని మాట్లాడారు. ప్రజలకు మనం ఏం చేశాం.. మనలో ఉన్న లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయ పార్టీ లక్షణమని, కానీ చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాడన్నారు. తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు ఓటేయమంటున్నాడు పవన్. చంద్రబాబు మేలు కోసమే పవన్ పని చేస్తున్నాడన్నారు. ఇప్పటం సభకు.. మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండదన్నారు. సీఎం వైయస్ జగన్‌ను, కాపు నాయకులను దూషించడమే పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. నేడు మచిలీపట్నం సభలో జరగబోయేది కూడా ఇదేనన్నారు. మచిలీపట్నంలో జరగబోయేది ఆవిర్భావ సభ కాదు తస్మదీయ దూషణ సభ అన్నారు. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారన్నారు. ప్యాకేజీ స్టార్ అంటే పవన్‌కు కోపం వస్తుందని, ఏబీఎన్ రాధాకృష్ణ వెయ్యి కోట్ల స్టార్ ప్యాకేజ్ అంటే మాత్రం పవన్ ఆనందపడుతున్నాడని ఎద్దేవా చేశారు.