రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ జగన్ వెంటే..
2 Feb, 2023 12:54 IST
గుంటూరు: పార్టీ మారుతున్నట్టుగా కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం తనకు లేదని మాజీ మంత్రి, వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. పార్టీ మారడం అంటూ ఉండదని, అలా ఉంటే తాను రాజకీయాలు వదిలేసి ఇంటికే పరిమితమవుతానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత ఎటికెట్ ఎక్కడ కేటాయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు.