ప్రతిపక్షానికి వీపుల పగిలేలా ప్రజలు బాదడం గ్యారెంటీ
అమరావతి: మరో ఏడాదిన్నరకు ప్రతిపక్షానికి వీపుల పగిలేలా ప్రజలు బాదడం గ్యారెంటీ అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.మూడేళ్లుగా రాష్ట్ర ఇమేజ్‌పై ప్రతిపక్షం విషం చిమ్ముతోంది. రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ప్రతిపక్ష నేత చంద్రబాబు. తప్పుడు నివేదికలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారు. చంద్రబాబు తీరును మాకీ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. గత టీడీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైంది. గతంలో కేవలం కాగితాల్లో మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు బాదేస్తారు. శుక్రవారం అసెంబ్లీలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చలో ఆయన మాట్లాడారు. అప్పుల కొలిమిలో రాష్ట్రాన్ని వదిలి వెళ్లింది గత ప్రభుత్వం. అయినా వైయస్ జగన్ ఎక్కడా తడబడకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తను ఇచ్చిన హామీలు వదిలేయకుండా పరిపాలన చేస్తున్నారు.ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో తాపత్రయపడుతున్నారు. ప్రతిపక్షం బాదుడే బాదుడు అంటోంది... ఒక ఏడాది ఆగితే ప్రతిపక్షానికి వీపుల పగిలేలా ప్రజలు బాదడం గ్యారెంటీ.
ప్రతిపక్షం కేవలం రాష్ట్ర ఇమేజ్ ని దిగజార్చడం కోసం, విషం చిమ్మడంకోసం పనిచేసింది. ఒక బాధ్యత గలిగిన ప్రతిపక్షంగా ఎప్పుడూ పనిచేయలేదు. ఈ రాష్ట్రం శ్రీలంకం అయిపోతుంది, అథోగతి పాలౌతుందిఅని ఎంతో విషం చిమ్ముతోంది.
ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పత్రిపక్షనాయకుడే. ఈ ఆరునెల్లలో దేశంలో లక్షా డెభైఒక్క వేల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో దాదాపు 41వేల కోట్లు మన ఏపీలోనే పెట్టుబడులు పెట్టారు. అంటే దేశంలో జరిగిన ఇన్వెస్టమెంట్స్ లో 25%. దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డిగారి పాలనవల్లే..గతంలో బాబు ముఖం చూసి, ఇమేజ్ ని చూసి పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసారు.
కానీ అది నిజం కాదు.. పెట్టుబడులు కేవలం పెట్టుబడిదారుడికి లాభము, అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ సహకారం ఎక్కడుంటుందో అక్కడే పెట్టుబడులు వస్తాయి. జగన్ నిష్పక్షపాతమైన పరిపాలన వల్లనే ఈ పెట్టుబడులు సాధ్యం అయ్యాయి.
అమరావతిని డిజైన్ చేయడానికి మాకీ అనే ఒక జపనీస్ సంస్థను పిలిచారు. ఏపీకంటే బీహార్ చాలా బెటర్
ఏపీలో మాకు వింత అనుభవాలు జరిగినాయి. సీఆర్డీఏని స్వతంత్ర్యంగా పనిచేయనివ్వరు.
రాజకీయ జోక్యం ఎక్కువ. అంతాగోప్యం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉత్త ప్రచారమే అని ఆ మాకీ సంస్థ స్వయంగా రాసిన లేఖ. 2018-19లో వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంక్స్ కి 2020-21కి వచ్చిన ర్యాంకింగ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది.
గతంలో ఎక్కడా రాండమ్ వెరిఫికేషన్ కానీ, పెరామీటర్స్ కానీ లేవు..రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే ర్యాంకింగ్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈసారి అలాకాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన పెరామీటర్స్ అన్నిటినీ అమలు చేసింది.
దేశం అంతా గుజరాత్ మోడల్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోడల్ జగన్ మోడల్ గురించి చెప్పుకుంటున్నారు.
ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. వైద్య, విద్యా సౌకర్యాలు , సంక్షేమ పథకాల వల్ల ఈ రాష్ట్రంలో జీవించడం చాలా సంతోషకరం అనే భావన కల్పించేలా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.
2022 జనవరి నుండి జులై వరకూ దేశం మొత్తం మీద రూ. 1,71,285 కోట్లు పెట్టుబడి వస్తే
మన రాష్ట్రంలో రూ.40,361 కోట్లు అంటే దాదాపు 25% వాటా మనం సాధించాం.
2019-22 మధ్యలో 99 మేజర్ పరిశ్రమలు 35 నుండి 36 వేల MSMEలు మన రాష్ట్రంలో స్థాపించబడ్డాయి
కోటు పాంటు అద్దెకిచ్చి, టెంట్ వేసి మీటింగ్ లు ఏర్పాటు చేసి వాటిని పార్టనర్ షిప్ సమ్మిట్ అని ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు. మొత్తం బాబు హయాం ఐదేళ్లలో 16 లక్షల కోట్ల MOUలు అని చెప్పారు.
కానీ పెట్టుబడులు వచ్చింది ఐదేళ్లలో కేవలం రూ.59,968 కోట్లు మాత్రమే
మన ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులు.
2019లో రూ.18,076కోట్లు
2020లో రూ. 13,032కోట్లు
ఈరోజు వరకూ చూస్తే 80వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
దాదాపు లక్షన్నర మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని పార్థసారధి వివరించారు.