చిరంజీవిని నేను విమర్శించలేదు
విజయవాడ: సినీ నటుడు చిరంజీవిని నేను విమర్శించలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తన మాటల్ని జనసేన, టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడుతానని కొడాలి నాని హెచ్చరించారు. మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
ఓ సినిమా ఫంక్షన్‌లో రోడ్లు, సంక్షేమం గురించి చిరంజీవి మాకు సలహా ఇచ్చారు..మేం వింటాం. చిరంజీవిని నేను విమర్శించలేదు. నా మాటల్ని జనసేన, టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు పకోడి వ్యక్తులు ఉన్నారు. డ్యాన్స్‌లు రానివారు, నటన తెలియని వాళ్లు ఉన్నారు. ఆ వెధవలు నా గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవిని పకోడి అన్నట్లు ఇక్కడున్న కొంత మంది టీడీపీ, జనసేన వెధవలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. శ్రీరామ అన్నా కూడా టీడీపీ, జనసేనకు నీ అమ్మ అన్నట్లుగా వినబడుతుంది. వాళ్లకు ఎలా వినిపించినా కూడా నా ఈక ముక్క కూడా ఊడిపోదు. వాళ్లు ఎన్ని ధర్నాలు చేసుకున్నా..రోడ్డు మీద పందుల్లా పొర్లాడినా కూడా నేను ఎవరికీ సమాధానం చెప్పను. నేను చిరంజీవిని విమర్శించలేదు. పనికిమాలిన వ్యక్తులు నాకు, చిరంజీవికి మధ్య ఎలాంటి అఘాదం సృష్టించలేరు. నేను ఏమన్నానో ఆయనకు తెలుసు. నాకు చిరంజీవితో సన్నిహిత సంబంధం ఉంది. చిరంజీవిని ఈ రోజు, ఆ రోజు ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఊరేగింపుగా మా ఆఫీస్ ముందు వెళ్తుంటే నేను బయటకు వచ్చి నమస్కారం చేశాను. చిరంజీవిని అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడిన వ్యక్తిని నేను. ఎవర్నీ దూషించని చిరంజీవి గురించి మాట్లాడేంత సంస్కారహీనుడిని కాదు. వైయస్ జగన్ గురించి, మా గురించి మాట్లాడితే చంద్రబాబు అయినా, వాడి తాత ఖర్జూర నాయుడైనా సరే, వాడి ముత్తాత యాలుక్కాయ నాయుడైనా సరే చీల్చి చెండాడుతాం కానీ మా గురించి మాట్లాడని వారిని ఏమీ మాట్లాడం. మీరందరూ కలిసి నేను అనని మాటలు అన్నట్లు రోడ్లెక్కితే నేనేమి చేయలేను. నా ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరని కొడాలి నాని హెచ్చరించారు.